- డీఆర్డీవో పీడీ సాయాగౌడ్
బాల్కొండ, వెలుగు : ప్రస్తుతం లేబర్ వర్క్స్ తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో మహిళా సంఘాలకు పక్కా భవనాలు నిర్మిస్తోందని డీఆర్డీవో పీడీ సాయాగౌడ్ తెలిపారు. శనివారం బాల్కొండలో ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన రూ.2,65,64,745 వ్యయంతో 111 పనుల పురోగతిపై 17వ సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. గతంలో సాధారణ పని దినాల్లో అవకతవకలు జరిగాయని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 15 లక్షల పనిదినాలు పూర్తి చేశామని, గతంలో మార్చి నెలలోనే 16లక్షల పనిదినాలు చేశామని వెల్లడించారు. గ్రామ పంచాయతీ తీర్మానాలతో సెంట్రల్, స్టేట్ షేర్ తో మండల,గ్రామ మహిళా సమాఖ్య సంఘాల భవనాలు చేపడుతున్నట్లు చెప్పారు.ఇందిరమ్మ లబ్ధిదారులకు ఐహెచ్ హెచ్ఎల్ ద్వారా రూ.12000, ఇంటి నిర్మాణం కోసం రూ.27000, జాబ్ కార్డుల ద్వారా 90 రోజుల పని దినాలు కల్పిస్తామని చెప్పారు.
జిల్లాలో ఇప్పటికే 1400 మందికి ఈ పథకం వర్తింపజేశామన్నారు. లేబర్ ఓరియెంటెడ్ కాకుండా మెటీరియల్ ఓరియెంటెడ్ పనులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. అందులో భాగంగా జిల్లాలో పౌల్ట్రీ, డెయిరీ ఫారం నిర్మాణం కోసం ఉపాధి హామీ నిధులతో చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏవీవో నారాయణ, అంబుడ్స్ మెన్ శ్రీనివాస్, ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, ఏపీవో ఇందిర, ఫీల్డ్ అసిస్టెంట్లు, కూలీలు
పాల్గొన్నారు.
టెక్నీకల్ అసిస్టెంట్ కుటుంబానికి రూ.లక్షా 40వేల సాయం
బాల్కొండలో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేసి అకాల మరణం పొందిన ధనుంజయ్ కుటుంబానికి జిల్లా ఎఫ్టీఈలు శనివారం రూ. లక్ష 40వేల ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు ఆయన భార్య శ్రీలతకు డీఆర్డీవో పీడీ సాయాగౌడ్ అందించారు. కార్యక్రమంలో ఏవీవో నారాయణ, అంబుడ్స్ మెన్ శ్రీనివాస్, బాల్కొండ ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి, ఏపీవో ఇందిరా, టెక్నికల్ అసిస్టెంట్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగార్జున, కోశాధికారి అరవింద్, టెక్నికల్ అసిస్టెంట్ రవీందర్, వరగంగా, కంప్యూటర్ ఆపరేటర్ రామ, ఫీల్డ్ అసిస్టెంట్లు అనిల్, కిషోర్, రాజనర్సయ్య, గంగాధర్, నర్సయ్య, లక్ష్మి, రాజేందర్, సురేశ్, విప్లవ్ పాల్గొన్నారు.
