- డీఆర్డీవో సురేందర్
లింగంపేట, వెలుగు: ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డీఆర్డీవో సురేందర్ సూచించారు. మంగళవారం లింగంపేటలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. తూకానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని తేమశాతం చూసి కాంటా పెట్టాలన్నారు.
కేంద్రాల్లో నిర్వహణ సక్రమంగా ఉండాలని ధాన్యం సేకరణ, స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మార్కెటింగ్ డీపీఎం సాయిలు, ఏపీఎం వినోద్, సీసీలు గంగరాజం పాల్గొన్నారు.
