గుండాల, వెలుగు : ఏజెన్సీ పోలీస్ స్టేషన్లో పని చేసే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఇల్లందు డీఎస్పీ చంద్రబాన్ స్పష్టం చేశారు. శనివారం గుండాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసుల పనితీరు, రికార్డులను పరిశీలించారు. సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి కిట్ బ్యాగులను పరిశీలించారు.
నిషేధిత నక్సల్స్ కు ఎవరైనా సహకరిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ రవీందర్, ఎస్సై రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.