
- రాజగోపురంలో అమ్మవారికి పూజలు
పాపన్నపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో మెదక్ జిల్లాలోని ఘనపూర్ ఆనకట్ట పూర్తిగా నిండి పొంగి పొర్లుతోంది. ఏడుపాయల వన దుర్గా భవానీ మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గుడి ముందున్న నది పాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహంతో ఆలయానికి రాకపోకలు బంద్ అయ్యాయి.
పూజారులు ప్రధాన ఆలయాన్ని మూసి వేసి రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గగానే యథావిధిగా అమ్మవారి దర్శనం కల్పిస్తా మని ఆలయ ఈవో చంద్ర శేఖర్ తెలిపారు. ఘనపూర్ ఆనకట్ట పొంగిపొర్లుతుండడంతో భక్తులు ఆనకట్ట వైపు వెళ్లకుండా పోలీసులు ఔట్ పోస్టు, బారికేడ్లు ఏర్పాటు చేశారు.