వుహాన్ ఓపెన్ క్వార్టర్స్‌కు స్వితోలినా.. స్వైటెక్ విజయం, సబలెంకకు షాక్

 వుహాన్ ఓపెన్ క్వార్టర్స్‌కు స్వితోలినా.. స్వైటెక్ విజయం, సబలెంకకు షాక్

వుహాన్‌‌‌‌: ఉక్రెయిన్‌‌‌‌ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ ఎలీనా స్వితోలినా.. వుహాన్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో స్వితోలినా 6–1, 6–4తో గువో హన్యు (చైనా)పై గెలిచింది. మ్యాచ్‌‌‌‌ ఆరంభ, చివరి గేమ్‌‌‌‌ల్లో గువో సర్వ్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేసిన స్వితోలినా ఏకపక్ష విజయాన్ని అందుకుంది.

మ్యాచ్‌‌‌‌ ఆరంభం నుంచి బలమైన సర్వీస్‌‌‌‌లతో చెలరేగిన స్వితోలినా.. గువోకు పుంజుకునే చాన్స్‌‌‌‌ ఇవ్వలేదు. మరో మ్యాచ్‌‌‌‌లో ఇగా స్వైటెక్‌‌‌‌ (పోలెండ్‌‌‌‌) 6–1, 6–4తో ఆష్లిన్‌‌‌‌ క్రూగర్‌‌‌‌ (అమెరికా)పై గెలవగా, కరోలినా ముచోవా (చెక్‌‌‌‌) 7–5, 6–3తో దియానా ష్నైడర్‌‌‌‌ (రష్యా) చేతిలో ఓడింది. దాంతో స్వైటెక్‌‌‌‌ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌‌‌‌కు అర్హత సాధించడంలో ముందంజ వేసింది. టాప్‌‌‌‌సీడ్‌‌‌‌ అరీనా సబలెంక, జెస్సికా పెగులా రెండో రౌండ్‌‌‌‌లోనే నిష్క్రమించారు.