స్టోక్స్​, గ్రీన్​కు లైన్​ క్లియర్​

స్టోక్స్​, గ్రీన్​కు లైన్​ క్లియర్​

కొచ్చి: ఐపీఎల్​ మినీ ఆక్షన్​కు మరికొద్ది గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో ఫ్రాంచైజీలకు బీసీసీఐ గుడ్​న్యూస్​ చెప్పింది. ఇంగ్లండ్​ ఆల్​రౌండర్​ బెన్​ స్టోక్స్​, సామ్​ కరన్​, ఆసీస్​ ప్లేయర్​ కామెరూన్​ గ్రీన్ ఐపీఎల్​ మొత్తానికి అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. సౌతాఫ్రికా, వెస్టిండీస్​తో సహా ఇతర దేశాల ప్లేయర్లు ఇప్పటికే మెగా లీగ్​కు అందుబాటులో ఉంటారని తెలిసినా..  స్టోక్స్​, గ్రీన్​పై సందేహాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరిపై కూడా క్లారిటీ రావడంతో నేడు కొచ్చిలో జరిగే ఆక్షన్​లో వీరిద్దరు హాట్​ ఫేవరెట్​గా మారారు.

రూ. 2 కోట్ల బేస్​ప్రైస్​తో వస్తున్న వీళ్ల కోసం 10 ఫ్రాంచైజీలు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. మధ్యాహ్నం రెండున్నర గంటలకు మొదలయ్యే ఆక్షన్​లో 87 మంది కోసం ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. ఇందులో 30 మంది ఫారిన్​ ప్లేయర్లు ఉన్నారు. ఇందుకోసం 991 ప్లేయర్ల నుంచి 369 మందిని షార్ట్​ లిస్ట్​ చేశారు. ప్రతి ఫ్రాంచైజీ పర్స్​ను  మరో రూ. 5 కోట్లు పెంచడంతో మొత్తం రూ. 95 కోట్లకు చేరింది. మరోవైపు కొత్తగా తీసుకొచ్చిన ‘ఇంపాక్ట్​ ప్లేయర్​’ రూల్​ను కేవలం ఇండియన్స్​కే వర్తింప చేయాలని బీసీసీఐ డిసైడ్​ అయ్యింది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీలకు కూడా తెలిపింది.