
గండిపేట, వెలుగు: నార్సింగి మున్సిపల్ కమిషనర్ సంతకంతో నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి, గురువారం రిమాండ్‌కు తరలించారు. నార్సింగిలోని ప్లాట్ నం.146కు సంబంధించి సంతోశ్ అనే వ్యక్తి నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, ఆథరైజేషన్ లెటర్‌తో గండిపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిలీజ్ డీడ్ నమోదు చేయడానికి ప్రయత్నించాడు. అందులో మున్సిపల్ కమిషనర్ సంతకాలు ఉన్నట్లు చూపించాడు. అయితే, ఈ ప్లాట్‌ను ఓనర్ నీరజా జనవరి 2025లో అరవింద్ అనే వ్యక్తికి విక్రయించారు.
మళ్లీ అదే ప్లాట్‌పై నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగించి మోసానికి పాల్పడుతుండడంతో.. గండిపేట సబ్ రిజిస్ట్రార్ నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వస్తున్న విషయాన్ని గుర్తించిన సంతోష్ అక్కడ్నుంచి పరారయ్యాడు. ఈ మొత్తం వ్యవహారంలో మోసానికి పాల్పడిన తాడ్‌బన్‌కు చెందిన గులాం మహమ్మద్ ఖాన్, ఎస్‌బీనగర్‌కు చెందిన వెంకట్ సత్యనారాయణ, యూసుఫ్‌గూడకు చెందిన జహీర్ అహ్మద్, ఎల్బీనగర్ అల్కపురి కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చీడెళ్ల శివ నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సంతోష్ కోసం గాలిస్తున్నారు.