టెక్నాలజీని వాడటం అంటే ఇదే..  ఫొటోలు తీసి ఫేక్ IPL టికెట్లు తయారీ

టెక్నాలజీని వాడటం అంటే ఇదే..  ఫొటోలు తీసి ఫేక్ IPL టికెట్లు తయారీ

జనాలను మోసం చేస్తూ అడ్డదారుల్లో డబ్బు సంపాదించేవాళ్లు ఎక్కువైపోయారు. ఐపీఎల్ ఫ్యాన్స్ అభిమానాన్ని ఆసరాగా చేసుకున్న ముఠాలు.. వాళ్లను ఈజీగా మోసం చేస్తున్నాయి. తాజాగా నకిలీ ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల వార్త హైదరాబాద్ లో కలకలం రేపింది. ఫేక్ టికెట్స్ తయారుచేసి అక్రమంగా స్టేడియం లోపలికి తరలిస్తున్న 6 సభ్యుల ముఠా గుట్టును రట్టు చేశారు రాచకొండ పోలీసులు. 

రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహీన్ తెలిపిన వివరాల ప్రకారం.. అఖిల్ అహ్మద్ అలియాస్ పప్పు అనే వ్యక్తి ఈవెంట్ మేనేజర్ల వద్ద ఉన్న అక్రిడేషన్ పాసులను హై రిజల్యూషన్ కెమెరాతో ఫోటో తీసి, వాటి ద్వారా బార్కోడ్ లను నకిలీ టికెట్లలో ప్రింట్ చేస్తున్నాడు.

తర్వాత ఆడియన్స్ ను అక్రమంగా లోపలికి పంపుతున్నట్లు పోలీసులు విచారణలో కనుగొన్నారు. ఇలా ఈ ఆరుగురు ఇప్పటివరకు 200 పైగా ఫేక్ టికెట్లు తయారుచేసి పబ్లిక్ కు అమ్మినట్లు పోలీస్ విచారణలో తేలింది.