పెద్దపల్లిలో ఎంపీ వంశీకృష్ణకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన రైతులు, కార్యకర్తలు

పెద్దపల్లిలో ఎంపీ వంశీకృష్ణకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన రైతులు, కార్యకర్తలు

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఘన స్వాగతం చెప్పారు పెద్దపల్లి నియోజకవర్గం రైతులు, కార్యకర్తలు. ఇటీవల పార్లమెంటులో రైతుల సమస్యలపై గళం వినిపించి, యూరియా కొరతపై కేంద్రాన్ని నిలదీశారు ఎంపీ వంశీకృష్ణ. పెద్దపల్లి పార్లమెంట్  రైతులకు యూరియా సరఫరా అందేలా చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. 

పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం తొలిసారి పెద్దపల్లిలో అడుగుపెట్టిన సందర్భంగా.. శుక్రవారం (ఆగస్టు 29) కాంగ్రెస్ కార్యకర్తలు ఎంపీకి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. రైతు సమస్యల కోసం అహర్నిశలు పోరాడుతున్నందుకు ఎంపీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “రైతు సమస్యల కోసం మీరు చేసిన పోరాటం మాకు గర్వకారణం” అని కార్యకర్తలు భావోద్వేగంగా పేర్కొన్నారు. ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఎంపీ వంశీకృష్ణ .

కవ్వంపల్లి కుటుంబ సభ్యులకు ఎంపీ పరామర్శ :

పెద్దపల్లికి చేరుకున్న ఎంపీ వంశీకృష్ణ.. కవ్వంపల్లి రాజేశం పెద్దకర్మకు హాజరై వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మానకొండూర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.