బారికేడ్లను తొసేసి ముందుకెళ్లిన రైతులు

బారికేడ్లను తొసేసి ముందుకెళ్లిన రైతులు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హర్యానాలో రైతులు కదం తొక్కారు. చండీగఢ్ లోని రాజ్ భవన్ కు వెళ్లేందుకు వేలాది మంది రైతులు పంచకులకు చేరుకున్నారు. అయితే అక్కడే రైతులను అడ్డుకున్నారు పోలీసులు. టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. బారికేడ్లను తొసుకుని ముందుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని... రైతులను నియంత్రించేందుకు తగిన ఫోర్స్ ఉందని పోలీసులు చెప్పారు. అయితే రైతులు మాత్రం ఏది ఏమైనా రాజ్ భవన్ కు వెళ్లి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చి తీరతామంటున్నారు రైతులు.