
ఇటీవలి కాలంలో సాఫ్ట్ వేర్ ప్రొఫెషన్ లో ఉద్యోగాల కోత ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో రానున్న కాలంలో వరుస పండుగలను పురస్కరించుకుని కొన్ని ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఏర్పడినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ డిమాండ్ దృష్ట్యా యజమానులు సైతం వారి ప్రయోజనాలను తీర్చేందుకు ముందుకు వస్తున్నాయి.
అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు:
- దుకాణంలో ప్రదర్శనకారులు
- లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ పాత్రలు
- డిజిటల్ విక్రయదారులు
- కస్టమర్, పార్ట్ నర్ విక్రేత సేవలు
- బ్యూటీ కన్సల్టెంట్స్
- కాల్ సెంటర్ ఆపరేటర్లు, రిటైల్ అమ్మకాలు
గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2023 ఏప్రిల్-ఆగస్టు మధ్య పండుగ కాలం కోసం 23% సిబ్బంది అవసరాలు పెరిగాయని క్వెస్ కార్పొరేషన్ (Quess Corp) తెలిపింది. భారతదేశంలో పండుగల సీజన్‌లో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా BFSI, M&I, రిటైల్, టెలికాం రంగాలు తమ నియామక ప్రయత్నాలను మెరుగుపరిచాయని.. ఇటీవలి కాలంలో 32వేల ఉద్యోగాల నియామకం కోసం పోస్టింగ్ వెలువడింది.
ఉద్యోగార్థుల ప్రయోజనాలను తీర్చేందుకు యాజమాన్యాలు ముందుకొస్తున్నప్పటికీ.. వారు అడిగిన 16శాతం ప్రయోజనాలలో.. కంపెనీలు కేవలం 9శాతం మాత్రమే నెరవేరుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో నిర్వహించిన సర్వేలో తేలిన విషయాన్ని బట్టి చూస్తే.. 69% మంది యజమానులు ఈ పండుగ సీజన్‌లో తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నారు. పండుగ సీజన్‌లో రాబోయే పనిభారాన్ని నిర్వహించడానికి 20% మంది ఫ్రీలాన్సర్‌లు, కన్సల్టెంట్‌లు, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లు మొదలైన వారిని గిగ్ వర్కర్లను నియమించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అధ్యయనం 1వెయ్యి 127 మంది యజమానులు, 2వేల 593 మంది ఉద్యోగార్ధుల మధ్య నిర్వహించారు. ఈ సర్వేను వాల్యూవోక్స్ ఏప్రిల్ - జూన్ 2023 మధ్య ఇన్‌డీడ్ తరపున నిర్వహించింది.