రిజర్వ్ ఫారెస్ట్ లో ఆక్రమణలు తొలగించాలి : రామ్మోహన్

రిజర్వ్ ఫారెస్ట్ లో ఆక్రమణలు తొలగించాలి : రామ్మోహన్

దండేపల్లి, వెలుగు: రిజర్వ్ ఫారెస్ట్ లో ఆక్రమణలు తొలగించాలని జన్నారం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ రామ్మోహన్ సూచించారు. సోమవారం తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ లో రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. తాళ్లపేట రేంజ్ మేదరిపేట సెక్షన్‌లోని లింగాపూర్ బీట్‌లో 379, 380 కంపార్ట్​మెంట్​లో కొందరు అక్రమంగా గుడిసెలు వేశారని, వాటిని తొలగించి, ఉపాధిహామీ పథకంలో వెదురు, యూకలిప్టస్ తోటలు పెంచాలన్నారు.

 సంబంధిత పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. దండేపల్లి తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండే, ఎంపీడీవో జేఆర్.ప్రసాద్, రేంజ్ ఆఫీసర్ సుష్మారావు, ఎంపీవో విజయ్ ప్రసాద్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సాగరిక, ఏపీవో దుర్గాదాస్, జేఈ భీమయ్య, గిరిజనులు పాల్గొన్నారు.