చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి : మాజీ క్రికెటర్‌‌‌‌ ఎంఎస్‌‌‌‌కే.ప్రసాద్

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి : మాజీ క్రికెటర్‌‌‌‌ ఎంఎస్‌‌‌‌కే.ప్రసాద్
  • మాజీ క్రికెటర్‌‌‌‌ ఎంఎస్‌‌‌‌కే.ప్రసాద్​
  • ముగిసిన ఎంఎస్‌‌‌‌కే ఐసీఏ 
  • అండర్–16 క్రికెట్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌

సూర్యాపేట, వెలుగు: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మాజీ క్రికెటర్‌‌‌‌, చీఫ్‌‌‌‌ సెలక్టర్‌‌‌‌ ఎంఎస్‌‌‌‌కే.ప్రసాద్‌‌‌‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని కుడకుడ రోడ్డు క్రికెట్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో ఎంఎస్‌‌‌‌కే.ప్రసాద్‌‌‌‌ ఇంటర్నేషనల్​క్రికెట్‌‌‌‌అకాడమీ సూర్యాపేట ఆధ్వర్యంలో 10 రోజులుగా నిర్వహిస్తున్న ఎంఎస్‌‌‌‌కే ఐసీఏ అండర్‌‌‌‌–16 క్రికెట్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌ ఆదివారం రాత్రి ముగిసింది. ఫ్రీడమ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌అకాడమీ నల్లగొండ జట్టు ప్రథమ స్థానంలో, ఎంఎస్‌‌‌‌కే.ప్రసాద్‌‌‌‌ క్రికెట్‌‌‌‌అకాడమీ సూర్యాపేట జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి.

 బెస్ట్‌‌‌‌ బ్యాట్స్​మెన్‌‌‌‌గా డి.విష్ణు, బెస్ట్‌‌‌‌ బౌలర్లుగా రోషన్‌‌‌‌, ఎంవీపీ.అజాం, బెస్ట్‌‌‌‌ ఫీల్డర్‌‌‌‌ గా అఖిలేష్‌‌‌‌ యాదవ్‌‌‌‌ ఎంపికయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎస్​కే.ప్రసాద్​వారిని అభినందించి, బహుమతి ప్రదానం చేశారు. గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత నాగపురి రమేశ్, నల్లగొండ జిల్లా సెక్రటరీ సయ్యద్‌‌‌‌ అమీన్‌‌‌‌ బాబా, డాక్టర్‌‌‌‌ సందీప్‌‌‌‌, మున్సిపల్‌‌‌‌ ఎన్విరాన్మెంట్‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌ శివప్రసాద్‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, మేనేజర్‌‌‌‌ భరత్‌‌‌‌, హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ఉస్మద్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.