రైతులకు నీళ్లవ్వకుంటే సీఎం ఇంటి దగ్గర ధర్నా చేస్తాం : ఎర్రబెల్లి దయాకర్రావు

రైతులకు నీళ్లవ్వకుంటే సీఎం ఇంటి దగ్గర ధర్నా చేస్తాం : ఎర్రబెల్లి దయాకర్రావు

రాయపర్తి/ తొర్రూరు (పెద్దవంగర), వెలుగు: రైతులు బాగుండడమే తమ ఉద్దేశమని, వారంలోపు సాగునీళ్లు ఇవ్వాలని లేకుంటే సీఎం ఇంటి ఎదుట ధర్నా చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. ఆదివారం వరంగల్​ జిల్లా రాయపర్తి కార్యకర్తల సమావేశం, మహబూబాబాద్​ జిల్లా పెద్ద వంగరలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. పెద్దవంగర, దేవరుప్పుల, తొర్రూరు, కొడకండ్ల, సూర్యపేట జిల్లా, మహబూబాబాద్​ జిల్లా, వర్ధన్నపేట, వరంగల్​ జిల్లా అంతా ఎస్సారెస్పీ, కాళేశ్వరం నీటితో ఆధారపడి ఉన్నారన్నారు. 

పంటలు ఎడిపోయే పరిస్థితి ఉందని వారం రోజుల్లో నీళ్లు ఇవ్వకుంటే పోరాటం చేస్తామన్నారు. అనంతరం పెద్ద వంగర మండల పరిధిలోని బొమ్మకల్, చిట్యాల గ్రామాల్లో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.​