రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి : మంత్రి జీవన్రెడ్డి

రోడ్లు, కల్వర్టులు  దెబ్బతిన్నాయి : మంత్రి జీవన్రెడ్డి
  • మాజీ మంత్రి జీవన్​రెడ్డి

రాయికల్​, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు, కల్వర్టులు చాలాచోట్ల దెబ్బతిన్నాయని, వాటికి వెంటనే రిపేర్లు చేయాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అధికారులను కోరారు. శనివారం రాయికల్​మండలం మూటపెల్లి, కొత్తపేట, భూపతిపూర్, రామాజీపేట గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్లు, పంటపొలాలను పరిశీలించారు. 

అక్కడి నుంచే అధికారులతో ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారు. తక్షణమే రిపేర్లు చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని కల్వర్టుల ఎత్తు పెంచి నిర్మించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఆయన వెంట మాజీ సర్పంచి బెక్కం తిరుపతి,  బ్లాక్​ కాంగ్రెస్​అధ్యక్షుడు గోపి రాజారెడ్డి, లీడర్లు మహేందర్​గౌడ్, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చింతలపెల్లి గంగారెడ్డి, మహిపాల్, ఏలేటి రాజేందర్, సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.