అప్పుడు ఆస్ట్రేలియా.. ఇప్పుడు శ్రీలంక! ఇది టీమిండియా పవర్

అప్పుడు ఆస్ట్రేలియా.. ఇప్పుడు శ్రీలంక! ఇది టీమిండియా పవర్

క్రికెట్ లో సాధారణంగా జట్టు రికార్డులు బ్రేక్ చేయడం చూస్తూ ఉంటాం. ఈ సంగతి అలా ఉంచితే.. రికార్డులు బ్రేక్ చేస్తే వచ్చే కిక్ కన్నా.. ఛాంపియన్ ని చిత్తు చేస్తే వచ్చే మజానే వేరు. ప్రస్తుతం టీమిండియా ఆ సంతోషంలో మునిగి తేలుతుంది. శ్రీలంకపై తృటిలో పరాజయం తప్పించుకొని థ్రిల్లింగ్ విక్టరీ కొట్టిన భారత్.. ఒక అరుదైన రికార్డ్ తన పేరిట లిఖించుకుంది.
 
టీమిండియాకే సాధ్యమైంది

వరుసగా విజయాలు సాధిస్తున్న జట్లకు బ్రేక్ వేయాలంటే అది కేవలం భారత్ కే సాధ్యం అవుతుందేమో. ఆసియా కప్ సూపర్-4లో భాగంగా శ్రీలంకపై 41 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. లంక జైత్రయాత్రకు బ్రేక్ వేసింది. స్వదేశంలో ఇప్పటివరకు 13 మ్యాచులు గెలిచిన లంక నిన్న భారత్ జోరు ముందు తలవంచక తప్పలేదు. ప్రత్యర్ధి శ్రీలంకపై స్వదేశంలో మ్యాచ్ ఆడాలంటే పరాజయం పక్కా అనేలా చేశారు. కానీ ఈ రికార్డ్ కొనసాగించాలని భావించిన శ్రీలంక జట్టుకి భారత్ అడ్డుకట్ట వేయడంతో నిరాశ తప్పలేదు.
 
అప్పుడు ఆసీస్ కి కూడా ఇదే పరిస్థితి

1990 దశకంలో ఎంతో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా జట్టుని ఓడించాలంటే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టేది. ఈ క్రమంలో టెస్టుల్లో వరుసగా 16 విజయాలు నమోదు చేసి తిరుగులేని జట్టుగా నిలిచింది. అయితే 2001 లో ఆస్ట్రేలియా జట్టుని ఓడించి వరుస విజయాలకు బ్రేక్ వేసింది. కోల్ కత్తా టెస్టులో సంచలన విజయం సాధించిన భారత్.. అప్పట్లో మన తెలుగు క్రికెటర్ లక్ష్మణ్ ఆడిన ఇన్నింగ్స్(281)ఎవరు మర్చిపోగలరు. మొత్తానికి వరుసగా విజయాలు సాధిస్తున్న జట్లు ఇకపై భారత్ అంటే కాస్త జాగ్రత్త పడాల్సిందే.