బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 విస్తరణ

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 విస్తరణ
  • విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు పనులు
  •  రూ.150 కోట్లతో  టెండర్లు పిలిచిన బల్దియా
  • ఈ నెల 16 వరకు బిడ్ల స్వీకరణ

హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లోని విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్​పోస్ట్ వరకు 6.5 కి.మీ. రోడ్డు విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. ప్రస్తుతం 60 నుంచి -70 ఫీట్ల మేర ఉన్న రోడ్డును 100 నుంచి-120 ఫీట్లకు విస్తరించేందుకు జీహెచ్ఎంసీ రూ.150 కోట్లతో ఆదివారం టెండర్లు ఆహ్వానించింది.

 కేబీఆర్ పార్క్ చుట్టూ ఆరు ఫ్లైఓవర్లు, ఆరు అండర్​​పాస్​ల నిర్మాణంతో పాటు 120 ఫీట్ల రోడ్డు విస్తరణ జరుగనుంది. ఇందులో భాగంగా తొలుత విరించి నుంచి అగ్రసేన్ మహారాజ్, బాలకృష్ణ నివాసం మీదుగా చెక్ పోస్ట్ వరకు రోడ్డుని