కొత్త కారు కొనాలనుకునే వారికి మారుతి సుజుకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ జూన్ నెలలో మారుతి సుజుకి 'ఎరీనా' (Arena), 'నెక్సా' (Nexa) మోడల్ కార్లపై ఏకంగా రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్లు ఇస్తుంది. ముఖ్యంగా కంపెనీకి చెందిన ప్రీమియం కార్ల సిరీస్ అయిన 'నెక్సా' మోడళ్లపైనే ఎక్కువ ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, పాత కారు ఎక్స్ఛేంజ్ బోనస్, పాత కారు స్క్రాప్ బోనస్, లాయల్టీ రివార్డులు, కార్పొరేట్ డిస్కౌంట్లు అన్ని ఉన్నాయి.
నెక్సా కార్లపై ఆఫర్లు:
నెక్సా ఇన్విక్టో (Invicto MPV) కారుపైనే అత్యధికంగా రూ.2.15 లక్షల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.
గ్రాండ్ విటారా కారుపై రూ.90 వేల వరకు ఆఫర్లతో పాటు, కొన్ని నగరాల్లో రూ.1.85 లక్షల వరకు రోడ్-టాక్స్ మినహాయింపు, 5 ఏళ్ల ఫ్రీ వారంటీ కూడా లభిస్తోంది. దీని పెట్రోల్ వేరియంట్‌పై రూ.1.35 లక్షల వరకు, డెల్టా పెట్రోల్ వేరియంట్‌పై రూ.1.25 లక్షల వరకు, అలాగే CNG వెర్షన్లపై రూ.70వేల వరకు డిస్కౌంట్ ఇస్తుంది.
మిడ్-సైజ్ SUV కార్లపై రూ.90వేల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ.50వేల ఎక్స్ఛేంజ్ బోనస్ (లేదా రూ.30వేల స్క్రాపేజ్ బోనస్), రూ.60వేల లాయల్టీ రివార్డ్, రూ.10వేల ఇన్‌స్టిట్యూషనల్ సేల్స్ ఆఫర్ కలిసి ఉన్నాయి.
*ఇగ్నిస్ (Ignis) ఆటోమేటిక్ (AGS) మోడల్‌పై రూ.45 వేల వరకు, మ్యాన్యువల్ మోడల్‌పై రూ.40 వేల వరకు తగ్గింపు ఉంది.
*బాలెనో (Baleno) పెట్రోల్ మోడల్‌పై రూ.40వేల వరకు, CNG మోడల్‌పై రూ.35వేల వరకు ఆఫర్లు ఉన్నాయి.
*ఫ్రాంక్స్ (Fronx) టర్బో-పెట్రోల్ మోడల్‌పై రూ.25వేల వరకు, పెట్రోల్ ఇంకా CNG మోడళ్లపై రూ.15వేల వరకు డిస్కౌంట్ ఉంది.
*జిమ్నీ (Jimny Off-Roader) కారు అన్ని మోడళ్లపై రూ.45వేల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి.
ఎరీనా (Arena) కార్లపై ఆఫర్లు చూస్తే:
నెక్సా కార్లతో పోలిస్తే ఎరీనా మోడళ్లపై డిస్కౌంట్లు కాస్త తక్కువగా ఉన్నా, ఈ కార్ల పై కూడా మంచి ఆఫర్లే ఉన్నాయి. బ్రెజ్జా (Brezza SUV) పై రూ.55వేల వరకు ఆఫర్లు ఉండగా.. వాగన్ఆర్ (WagonR) పై రూ.52 వేల 500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఆల్టో కె10 (Alto K10) పై రూ.52 వేల 500 వరకు డిస్కౌంట్ ఉంది.
కొత్త స్విఫ్ట్ (Swift) ఆటోమేటిక్ (AGS) మోడల్‌పై రూ.45 వేల వరకు.. పెట్రోల్ మ్యాన్యువల్, CNG మోడళ్లపై రూ.40 వేల వరకు ఆఫర్లు ఉన్నాయి. ఎస్-ప్రెస్సో, సెలెరియో, ఈకో వంటి చిన్న కార్లపై రూ.37 వేల 500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. స్విఫ్ట్ టూర్ (Tour) కమర్షియల్ కార్లను టాక్సీలుగా వాడే ఈ మోడళ్లపై రూ.25వేల నుండి రూ.70వేల వరకు ఆఫర్లు ఉన్నాయి.
ALSO READ : పెళ్లికి ముందే ఫిజికల్ రిలేషన్ నేరం కాదు
ఈ కార్లపై ఎలాంటి ఆఫర్లు లేవు
మారుతి సుజుకి కంపెనీకి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న కొన్ని కార్లపై మాత్రం ఎలాంటి డిస్కౌంట్లు ప్రకటించలేదు. ముఖ్యంగా కొత్త డిజైర్ (Dzire), ఎర్టిగా (Ertiga) కార్లపై జూన్ నెలలో ఎలాంటి ఆఫర్లు లేవు. ఎందుకంటే వీటికి మార్కెట్లో ఇప్పటికే విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ నెలలో జరిగే అమ్మకాలు, రిజిస్ట్రేషన్లకు మాత్రమే వర్తిస్తాయి. మీరు తీసుకునే కారు మోడల్, కలర్, ఇంధనం (పెట్రోల్/CNG), మీ నగరాన్ని బట్టి ఈ ఆఫర్లు మారే అవకాశం ఉంది.
