తమిళనాడు సీఎంను కలిసిన గవర్నర్ తమిళిసై

 తమిళనాడు సీఎంను కలిసిన గవర్నర్ తమిళిసై

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో తెలంగాణ గవర్నర్ తమిళిపై భేటీ అయ్యారు.  తన సొంత నగరం చెన్నైకి వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం చెన్నైలోని తన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలసినట్లు సమాచారం. సీఎం స్టాలిన్ ను కలసిని సందర్భంగా గవర్నర్ రాజ్ భవన్ లో పండించిన మధురమైన మామిడి పండ్లను సీఎం స్టాలిన్ కు ఇచ్చినట్లు రాజ్ భవన్ వర్గాల సమాచారం. తెలంగాణ గవర్నర్ తమిళిసై పొరుగున ఉన్న పుదుచ్చేరి రాష్ట్రానికి కూడా ఇంచార్జ్ గవర్నర్ గా అదనపు బాద్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పాండిచ్చేరి ఎయిర్ పోర్టుకు 200 ఎకరాల స్థలం కేటాయించి సహకరించాలని ఈ సందర్భంగా గవర్నర్ కోరారు. ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం వల్ల తమిళనాడులోని సరిహద్దు జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరం అవుతుందని తెలియజేశారు. గవర్నర్ సీఎం స్టాలిన్ ల భేటీలో కేంద్ర మాజీ మంత్రి టి.ఆర్ బాలు కూడా పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై మర్యాదపూర్వకంగా భేటీ జరిగినట్లు తమిళనాడు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.