గాంధీనగర్ లో మోడీ రోడ్ షో

గాంధీనగర్ లో మోడీ రోడ్ షో

గుజరాత్ లో ప్రధాని మోడీ రెండో రోజు రోడ్ షో నిర్వహిస్తున్నారు. గాంధీనగర్ నుంచి దహెగాం వరకు ప్రధాని మోడీరోడ్ షో చేపట్టారు. రోడ్ షో లో ప్రధాని మోడీ తో పాటు గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోడీ రాజ్ భవ న్ నుంచి దహెగామ్ లోని లవాడ్ గ్రామం వరకు రోడ్ షో చేపట్టనున్నారు. తర్వాత గాంధీనగర్ లోని నేషనల్ డిఫెన్స్ యూనివర్సికి మోడీ చేరుకోనున్నారు. నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీలో కాన్వోకేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు మోడీ.  13 మంది స్టుడెంట్లకు డాక్టరేట్, 38 మందికి గోల్డ్ మెడల్స్ అందిచనున్నారు. తర్వాత నేషనల్ డిఫెన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కొత్త కాంప్లెక్స్ ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 6 గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంలో ఖేల్ మహా కుంభ్ ను ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ.

మరిన్ని వార్తల కోసం

కారు చివర్ల ల్యాండైన హెలికాప్టర్​ను చూసిన్రా! 

ఉక్రెయిన్​పై విరుచుకుపడుతున్న రష్యా