తాగితే నన్ను నేనే మర్చిపోతా : దొంగకు కారు ఇచ్చి.. మెట్రోలో వెళ్లాడు

తాగితే నన్ను నేనే మర్చిపోతా : దొంగకు కారు ఇచ్చి.. మెట్రోలో వెళ్లాడు

ఓ వ్యక్తి ఒళ్లు కూడా తెలియనంత మద్యం సేవించి, చివరికి తాను ప్రయాణిస్తున్న కారు తనదే అన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. ఆ సమయంలో తనతో ఉన్న ఓ అపరిచితుడు అదే అవకాశంగా భావించి.. కారుతో ఉడాయించాడు.

గురుగ్రామ్ లో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ వ్యక్తి ల్ఫ్ కోర్స్ రోడ్‌లోని ఒక కంపెనీలో ఉద్యోగి అయిన అమిత్ ప్రకాష్. పని ముగించుకుని తన కారులో విశ్రాంతి తీసుకుంటుండగా.. అంతలో అక్కడికి వచ్చిన ఒక అపరిచితుడితో మద్యం సేవించాడు. ఆ తర్వాత అమిత్ తన కారుతో ఆ వ్యక్తి కొంత దూరం ప్రయాణించాడు. అలా వెళ్లిన తర్వాత  అపరిచితుడు.. అమిత్ ను దిగిపోవలసిందిగా కోరడంతో ఢిల్లీలోని సుభాష్ చౌక్ వద్ద అమిత్ తన స్వంత వాహనం నుండి దిగిపోయాడు.

మద్యం మత్తులో ఉన్న అమిత్.. అది తన కారే అన్న విషయాన్ని మర్చిపోయాడు. కారు దిగి ఇంటికి వెళ్లేందుకు మెట్రోను ఉపయోగించాల్సి వచ్చింది. అలా ఇంటికి చేరుకున్న అమిత్.. మరుసటి రోజు జరిగిన విషయాన్ని గ్రహించాడు. వెంటనే సెక్టార్ 65 పోలీస్ స్టేషన్‌ని సందర్శించి ఫిర్యాదును దాఖలు చేశాడు. ఆ తర్వాత దొంగతనం కేసు బుక్ చేసిన పోలీసులు.. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 379 కింద అభియోగాలు మోపారు. ఆ మత్తులో రూ.2వేల విలువైన వైన్ బాటిల్ కు రూ.20వేలు చెల్లించానని అమిత్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

సుభాష్ చౌక్ వరకు తాను అపరిచితుడితో కలిసి ప్రయాణించానని, లొకేషన్‌కు చేరుకున్న తర్వాత, అమిత్ తన సొంత కారులో ఉన్నానని మరచిపోయానని అంగీకరించాడు. ఆ తర్వాత అపరిచితుడి అభ్యర్థనకు కట్టుబడి కారు నుంచి దిగినట్లు పేర్కొన్నాడు. అక్కడి నుంచి ఆటో రిక్షాలో హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్‌కు చేరుకుని తిరిగి తన ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడన్నాడు. అయితే, అమిత్ అపరిచితుడి గురించి నిర్దిష్ట వివరాలను మాత్రం గుర్తుకు తెచ్చుకోలేకపోయాడు.