వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు: ఐనవోలు మల్లన్న జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్అధికారులను ఆదేశించారు. జాతర నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ ఐనవోలు వచ్చి, స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు.
అనంతరం ఆఫీసర్లతో కలిసి పనులను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కందుల సుధాకర్, చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
