చండీగఢ్ను ఉమ్మడి రాజధానిగానే ఉంచాలి: హర్యానా తీర్మానం

 చండీగఢ్ను ఉమ్మడి రాజధానిగానే ఉంచాలి: హర్యానా తీర్మానం
  • పంజాబ్ నిర్ణయం కరెక్ట్ కాదన్న హర్యానా సీఎం మనోహరలాల్ ఖట్టర్

కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ పై వివాదం మరింత రాజుకుంటోంది. పంజాబ్, హర్యానాల ఉమ్మడి రాజధాని చండీగఢ్ ను తమకే బదిలీ చేయాలని పంజాబ్ అసెంబ్లీ తీర్మానించిన నేపథ్యంలో హర్యానా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఛండీగఢ్ ను ఉమ్మడి రాజధానిగా యధావిధిగా కొనసాగించాలని హర్యానా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. తీర్మానానికి మద్దతు తెలిపిన విపక్షాలకు ముఖ్యమంత్రి మనోహరల్ లాల్ ఖట్టర్ ధన్యవాదాలు తెలిపారు. 
పంజాబ్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని.. హర్యానా ప్రజలకు ఆమోదయోగ్యం కాదన్నారు. మూడు గంటలపాటు కొనసాగిన ఈ చర్చలో సట్లేజ్-యమునా లేక్ నిర్మాణం, హిందీ మాట్లాడే రాష్ట్రాల జాబితాలో హర్యానాను చేర్చే అంశాలపై చర్చించారు. హర్యానా రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టుతో పాటు.. చండీగఢ్ పై హక్కును కలిగి ఉందన్నారు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ..ఎవరి ఒత్తిడితో పంజాబ్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసిందో చెప్పాలన్నారు. చండీగఢ్ హర్యానా కే దక్కుతుందని షా కమిషన్ సిఫార్సు చేసిందన్నారు ఖట్టర్.

 

ఇవి కూడా చదవండి

దొంగతనానికి వెళ్లి కిటికీలో ఇరుక్కున్న దొంగ

డబల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయడం లేదని అర్ధరాత్రి ఏం చేశారంటే..

అజీమ్ ప్రేమ్జీ జీవితం అందరికీ ఆదర్శం

ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల బోన్లతో డాక్టర్ల నిరసన