డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయడం లేదని అర్ధరాత్రి ఏం చేశారంటే..

డబుల్ బెడ్రూం ఇళ్లు పంపిణీ చేయడం లేదని అర్ధరాత్రి ఏం చేశారంటే..

నిజామాబాద్ జిల్లా బస్వాపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయడం లేదని స్థానికులు ఆందోళనకు దిగారు. ఇండ్ల నిర్మాణం పూర్తై మూడేళ్లు గడిచినా తమకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి డబుల్  బెడ్ రూమ్ ఇండ్ల తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు గ్రామస్థులు. ఇండ్లు పూర్తయినా తమకు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు  తిరిగినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఏడేళ్ల క్రితం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు స్థలం లేకపోవటంతో తమ స్థలాన్ని ఇచ్చామంటున్నారు లబ్ధిదారులు. బస్వాపూర్ గ్రామంలో 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించింది ప్రభుత్వం. అధికారుల తీరుతోనే తమకు ఇండ్లు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు.

 

 

ఇవి కూడా చదవండి

అజీమ్ ప్రేమ్జీ జీవితం అందరికీ ఆదర్శం

ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల బోన్లతో డాక్టర్ల నిరసన

22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం బ్యాన్

వెడ్డింగ్ షూట్.. నదిలో కొట్టుకుపోయిన కొత్త జంట

మా పిల్లలను డ్రగ్స్ టెస్ట్ కు తీసుకొస్తా..