
సిద్దిపేట, వెలుగు: పీహెచ్సీలలో మెరుగైన వైద్య సేవలందించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ అన్నారు. గురువారం నంగునూరు మండలం రాజగోపాల్ పేట పీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించారు. ఓపీ రిజిస్టర్లు, ఫార్మసీ స్టోర్, లాబొరేటరీలు, వార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హై రిస్క్ గర్భిణీలను గమనించి మెరుగైన సదుపాయాలు ఉన్న ఆస్పత్రులకు పింపించాలన్నారు. ఆశాలు 102 వాహనాల ద్వారా గర్భిణులను సెంటర్లకు తీసుకురావాలని సూచించారు.
ఆరోగ్య మహిళా క్లినిక్ లు, తల్లి-బిడ్డల సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పిల్లవాడికి వ్యాధినిరోధక టీకాలు వంద శాతం సమయానికి అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో పల్వన్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ వోలు రేవతి, శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్లు ఆనంద్, నారాయణ్ రావు, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.