
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలోని ధరాలి గ్రామంలో మేఘాల విస్ఫోటనం(cloud burst) వల్ల భారీ విధ్వంసం చోటు చేసుకుంది. ఈ ప్రకృతి ప్రళయం చాలా మంది ప్రాణాలు కోల్పోగా, ఎంతో మంది కనిపించకుండా పోయారు. అయితే వర్షాకాలం రాగానే ఒకవైపు మనం సమ్మర్ వేడి రిలీఫ్ అవుతాం. మరోవైపు వరదలు, కొండచరియలు విరిగిపడటం లేదా పిడుగులు పడటం జరుగుతుంటాయి. అయితే క్లౌడ్ బరస్ట్ ఎలా ఏర్పడుతుందో తెలుసా..
క్లౌడ్ బరస్ట్ అనేది సహజంగా ఆకాశంలో ఏర్పడుతుంది, అది కూడా భూమి నుండి దాదాపు 15 కిలోమీటర్ల ఎత్తులో. కాబట్టి సాధారణంగా క్లౌడ్ బరస్ట్ వార్తలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ & కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో వినిపిస్తుంటాయి. కొండ ప్రాంతాలలో ఉండే ప్రజలు దాదాపు ప్రతి వర్షాకాలంలో ఇలాంటి విపత్తులను ఎదుర్కోవలసి ఉంటుంది. అసలు మేఘం ఎలా పేలుతుంది, దానికి కారణం ఏంటి అనే ప్రశ్న మీకు ఉండొచ్చు...
ఒకే చోట 20సెం.మీ కంటే ఎక్కువ వర్షం పడితే దానిని క్లౌడ్ బరస్ట్ అంటారు. దీనికి కారణం మేఘాలకు తేమ చేరకపోవడం. తేమ మేఘాలకు చేరనప్పుడు లేదా చేరుకోవడం ఆగిపోయినప్పుడు చల్లని గాలి దానిలోకి ప్రవేశిస్తుంది, తరువాత తెల్లటి మేఘాలు నల్లటి మేఘాలుగా మారి ఉరుములతో భారీ వర్షం కురుస్తాయి.
ALSO READ : ఆపరేషన్ సింధూర్లో బార్డర్ దాటకముందే..
వేడి గాలి పైకి: వాతావరణంలో తేమ, వేడి స్థాయి పెరిగినప్పుడు మేఘాల విస్ఫోటనం జరుగుతుంది. ఇలా కొండ ప్రాంతాలలో ఎక్కువగా సంభవిస్తుంది. మేఘాల విస్ఫోటనం ప్రక్రియ సైన్స్ కి సంబంధించినది. వేడి గాలులు మేఘాన్ని పైకి తీసుకెళ్లినప్పుడు, పైన ఉన్న మేఘం చల్లని గాలిని తాకుతుంది. ఈ మేఘం తేమతో నిండి ఉంటుంది, చల్లని గాలిని తాకినప్పుడు మేఘంలో పేరుకుపోయిన తేమ లేదా నీటి ఆవిరి వేగంగా నీటి బిందువులుగా మారుతుంది తరువాత భారీ వర్షం కురుస్తుంది.
కొండ ప్రాంతాలలో గాలి వేగంగా పైకి వీస్తుంది, ఇది మేఘాలను ఏర్పరుస్తుంది ఇంకా చల్లని గాలితో వర్షం పడుతుంది. వర్షాకాలంలో, తక్కువ వాయు పీడనం ఉన్న ప్రాంతాలలో వేడి, తేమతో కూడిన గాలి వేగంగా పెరుగుతుంది, ఇది మేఘాలు విస్ఫోటనం చెందే అవకాశాలను పెంచుతుంది. చల్లని ఇంకా వేడి గాలులు ఒకదానికొకటి ఢీకొంటే, మేఘాలు కూడా విస్ఫోటనం చెందుతాయి.
క్యుములోనింబస్ మేఘాలు: వరదలకు కారణమయ్యే మేఘాలను క్యుములోనింబస్ మేఘాలు అంటారు. ఎందుకంటే అవి భారీ వర్షాలకు కారణమవుతాయి. మేఘాలు విస్ఫోటనం చెందే ప్రక్రియలో చిన్న నీటి బిందువులు ఒకదానికొకటి ఢీకొని భారీ రూపాన్ని సంతరించుకుంటాయి. ఈ ప్రక్రియను లాంగ్ముయిర్ అవపాతం అంటారు. ఇందులో, పెద్ద వర్షపు బిందువులు చిన్న బిందువులతో కలిసి వేగంగా కిందకు వస్తాయి.