మంచి రెస్టారెంట్‌కి వెళ్తే మెను చూసి కొత్తవి తిందామని అనుకుంటాం. టేస్ట్ బాగున్నా.. వాటిని తినడం వల్ల కడుపులో ఇబ్బంది అనిపించొచ్చు. మనకి సరిపడే ఫుడ్ ఏదో తెలిస్తే, పైన చెప్పినలాంటి ఇబ్బందులు రావు. ఇదే ఐడియాతో ఓ ఐరిష్ స్టార్టప్ కంపెనీ మొదలుపెట్టారు. దానిపేరు ఫుడ్ మార్బుల్. ఈ కంపెనీ వాళ్లు బిస్కెట్ సైజులో ఓ డివైజ్ డెవలప్ చేశారు. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్‌ను ట్రాక్ చేసేలా ఒక ప్రోగ్రామ్ రాసుకున్నారు. అజీర్తి, కడుపునొప్పి, మలబద్ధకం.. వంటి లక్షణాలను ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమందిలో ఒకరికి ఉందనేది అంచనా. ప్రత్యేకంగా దీనికి ట్రీట్మెంట్ లేదు. లైఫ్ స్టయిల్, తిండి అలవాట్లు మార్చుకోవడమే. పొట్టకు ఇబ్బంది కలిగించే ఫుడ్ ఏంటో తెలుసుకోవడం చాలా కష్టం. 2019లో ఆరు యూరప్ దేశాల్లో ఈ టాపిక్ మీద కొంత స్టడీ చేసి, ఐరిష్ ఇంజినీర్స్ ఆంగస్ షార్ట్, పీటర్ హార్టీ ఈ ఫుడ్ మార్బుల్ అనే బ్రీత్ ఎనలైజర్‌ను కనుక్కున్నారు.
ఇలా పనిచేస్తుంది
మామూలుగా అయితే శ్వాస నుంచి హైడ్రోజన్ బయటికి రాదు. కానీ ఫుడ్ అరగకపోతే కనుక అది పులిసిపోయి హైడ్రోజన్ కూడా బయటకు వచ్చేస్తుంది. అదే కడుపునొప్పికి కారణం అవుతుంది.
ఈ ఫుడ్ మార్బుల్ డివైజ్ శ్వాసలో హైడ్రోజన్ లెవెల్స్‌ను చెక్ చేసి, ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. అంతేకాదు ఏ ఫుడ్ వంటికి సరిపడుతుందో కూడా చెబుతుంది. ఫుడ్ మార్బుల్ యాప్‌ను ఫోన్లో వేసుకుని, బ్లూటూత్‌తో కనెక్ట్ చేయాలి. ఈ యాప్‌లో వెయ్యి రకాల ఫుడ్స్, వాటి ఎఫెక్ట్స్ చూడొచ్చు.
