యూట్యూబ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీడియోల్లో మాట్లాడడు.. ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఉండదు.. నెలకు ఒకట్రెండు వీడియోలు.. కోటీ 5 లక్షల మంది సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్లు !

యూట్యూబ్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీడియోల్లో మాట్లాడడు.. ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఉండదు.. నెలకు ఒకట్రెండు వీడియోలు.. కోటీ 5 లక్షల మంది సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్లు !

పుట్టిన ఊరు, పంట పొలాలే అతని ప్రపంచం. ప్రతిరోజూ ఆ ప్రపంచాన్ని చుట్టి రాకపోతే ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రోజు గడవదు. ఉదయాన్నే పొలానికి వెళ్లడం, సాయంత్రం వరకు పనులు చేయడం, మధ్యలో ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే కెమెరాతో వీడియోలు తీయడం.. ఇదే అతని డైలీ రొటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఇక అతనికి బాగా నచ్చే పని ట్రాక్టర్​తో పొలం దున్నడం. ఈ సింపుల్ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైల్ వల్లే ప్రమోద్ కొన్ని లక్షల మందికి దగ్గరయ్యాడు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎదిగి ఎంతోమందికి ఇన్‌‌‌‌స్పిరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. 

ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజాపతి మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని విదిషా జిల్లాలోని ఒక చిన్న గ్రామం పలోహ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పుట్టాడు. వాళ్లది ఒక సాధారణ రైతు కుటుంబం. తల్లితండ్రులకు వ్యవసాయమే ఆధారం. ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా చిన్న వయసులోనే వ్యవసాయంపై ఇష్టం ఏర్పడింది. పొలాల్లో తిరుగుతూ.. ట్రాక్టర్ల మీద ఎక్కి ఆడుకుంటూ పెరిగాడు. తల్లిదండ్రులు అతను బాగా చదువుకుని పెద్ద పెద్ద కార్లలో తిరగాలని కోరుకున్నారు. 

కానీ.. అతనికి మాత్రం ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కి పొలాలు దున్నడంలోనే ఆనందం ఉంది. గ్రామంలో ప్రైమరీ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తి కాగానే  తండ్రితోపాటు పొలానికి వెళ్లి సాగు పాఠాలు నేర్చుకున్నాడు. అతనికి 20 ఏండ్లు వచ్చేనాటికి ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైం ఫార్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిపోయాడు. అందుకే ‘‘పొలాలే నా ఫస్ట్ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అవి లేకుండా నా జీవితాన్ని  ఊహించుకోలేను” అని తరచూ చెప్తుంటాడు. అయితే..  స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లు, ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడకం పెరగడంతో జీవితం మరో ములుపు తిరిగింది.
 
లక్షల మందికి..
ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియోల్లో ఎప్పుడూ పెద్దగా మాట్లాడడు. పైగా వాటిలో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కూడా పెద్దగా ఉండదు. కానీ.. అతని చానెల్ ద్వారా ఆధునిక వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్ బ్రాండ్లు, సీడ్ వెరైటీల గురించి చెప్తూ లక్షల మంది రైతులకు దగ్గరయ్యాడు. అతని వీడియోలకు ఇప్పుడు సపరేట్ ఫ్యాన్ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. 

ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చేసే ప్రయోగాలను చూసేందుకు చాలామంది ఇష్టపడుతుంటారు. దాంతో అతనికి బ్రాండ్ ఎండార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు కూడా వచ్చాయి. మహీంద్రా, ఈచర్ లాంటి కంపెనీలతో కలిసి పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ వీడియోలు చేశాడు. ‘‘యూట్యూబ్ నా జీవితాన్ని ఎంతో మార్చింది. ఇప్పుడు చాలామంది రైతులు నా వీడియోల ద్వారా ఎంతో నేర్చుకుంటున్నారు” అంటున్నాడు ప్రమోద్‌. 

మొదట్లో ఇబ్బందులు 
ప్రమోద్ యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టిన మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా వాళ్ల ఊరిలో ఇంటర్నెట్ సిగ్నల్ సరిగ్గా ఉండేది కాదు. దాంతో వీడియోలు అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు చాలా టైం పట్టేది. అయినా పట్టువదలకుండా వీడియోలు చేశాడు. దాంతో ప్రమోద్స్​ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెలకు ఒకట్రెండు వీడియోలు మాత్రమే చేస్తుంటాడు. పైగా అందరిలా షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియోలు కూడా చేయడం లేదు. అయినా.. సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్ల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది కేవలం 381 వీడియోలు మాత్రమే. అందులో ఒక్క షార్ట్ వీడియో కూడా లేదు. ప్రస్తుతం చానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోటి 5 లక్షల మంది సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. అంతేకాదు.. చానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఏడు వీడియోలు వంద మిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని దాటాయి. నదిలోకి ట్రాక్టర్లను తీసుకెళ్లి కడిగే ఒక వీడియో అయితే.. ఏకంగా 193 మిలియన్ల వ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించింది.

ఎప్పటికీ రైతునే..
“యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లూయెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారాలనే లక్ష్యంతో రాలేదు. నేను ఎప్పటికీ రైతునే. యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీడియోలు చేయడం నాకు ఒక హాబీ. వ్యవసాయంలో సాంకేతికత ఎలా ఉపయోగపడుతుందో అందరికీ  చెప్పాలనే ఉద్దేశంతోనే వీడియోలు చేస్తున్నా. భవిష్యత్తులో  గ్రామీణ యువతకు సాగు పద్ధతులపై ట్రైనింగ్ ఇవ్వాలి అనుకుంటున్నా. మన పల్లెలు డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారాలి” అని అంటున్నాడు ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.

ట్రాక్టర్లంటే ఇష్టం
ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వ్యవసాయంతోపాటు ట్రాక్టర్లు అంటే  చాలా ఇష్టం. అందుకే వాళ్ల పొలాలన్నీ తనే దున్నేవాడు. ట్రాక్టర్లతో అనేక ప్రయోగాలు, ఫీట్లు చేసేవాడు. అలాంటి టైంలోనే ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందరికీ చేరువయ్యింది. పల్లెల్లో కూడా స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ల వాడకం పెరిగింది. దాంతో.. ప్రమోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రైతులకోసం వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ముఖ్యంగా ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నడపడంలో టెక్నిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దాంతో పనులు చేస్తున్నప్పుడు ఏదైనా సమస్య ఎదురైతే ఎలా పరిష్కరించుకోవాలో తన వీడియోల ద్వారా చెప్పాలి అనుకున్నాడు.

వెంటనే 2015లో ‘ప్రమోద్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ పేరుతో ఒక చానెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టాడు. కానీ.. వీడియోలు తీయడానికి, ఎడిట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో అవన్నీ సమకూర్చుకుని చివరికి 2018లో తన మొదటి వీడియో అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. మొదట్లో పొలాల్లో ట్రాక్టర్ చేసే పనులు, పంటల సాగు, విలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వీడియోలు చేశాడు. ఆ తర్వాత ట్రాక్టర్ల పవర్ టెస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రివ్యూలు చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం అతని దగ్గర ఐదు ట్రాక్టర్లు ఉన్నాయి.