హైదరాబాద్‌లో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నీళ్లు బంద్

హైదరాబాద్‌లో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో  నీళ్లు బంద్

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్​కు తాగునీటిని సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు (కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్-3 పైప్​లైన్​లో రాజేంద్రనగర్ వద్ద 1400 ఎంఎం డ‌‌యా పైప్​లైన్​లో భారీ లీకేజీ ఏర్పడింది. దీనిని సరిచేయడానికి అత్తాపూర్ మూసీ వంతెన వద్ద 300 ఎంఎం స్కవర్ వాల్వ్ ఎక్స్​టెన్షన్ పైప్​లో లీకేజీ రిపేర్, మైలార్​దేవ్‌‌పల్లి ఫేజ్-3 పంప్ హౌస్​లో పనిచేయని వాల్వ్​ల మార్పిడి పనులు చేపట్టనున్నారు.

సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు 20 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు రోజులపాటు షేక్​పేట, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌‌నగర్, ప్రశాసన్​నగర్, తట్టిఖానా, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని మెట్రోవాటర్ బోర్డు తెలిపింది.