మన దేశంలోనే గాల్లో గుర్తు తెలియని వస్తువు.. నిలిచిన విమాన రాకపోకలు

మన దేశంలోనే గాల్లో గుర్తు తెలియని వస్తువు.. నిలిచిన విమాన రాకపోకలు

ఇంఫాల్ విమానాశ్రయం సమీపంలో ఆకాశంలో గుర్తు తెలియని వస్తువు ఎగరడం కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన భారత వైమానిక దళం (IAF).. తన రాఫెల్ యుద్ధ విమానాలతో మోహరించింది. నవంబర్ 19న మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఇంఫాల్ విమానాశ్రయంపై UFO కనిపించింది. ఆ తర్వాత దీని వల్ల కొన్ని వాణిజ్య విమానాలు సైతం ప్రభావితమయ్యాయి. ఇంఫాల్ కు రావాల్సిన రెండు విమానాలను అధికారులు దారి మల్లించారు. ఇంఫాల్ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న UFO గురించి సమాచారం అందిన వెంటనే, సమీపంలోని ఎయిర్‌బేస్ నుంచి ఒక రాఫెల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ వెళ్లి దాని కోసం వెతకడానికి ప్రయత్నాలు సాగించిందని రక్షణ వర్గాలు తెలిపాయి .

విమానాశ్రయానికి సమీపంలో ఓ గుర్తుతెలియని ఎగిరే వస్తువు కనిపించినట్టు సీఐఎస్ఎఫ్ నుంచి ఏటీసీకి సమాచారం అందిందని అధికారులు తెలిపారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన అధికారులు.. రెండు విమానాలను దారి మళ్లించగా.. అందులో కోల్ కతా నుంచి రావాల్సిన ఇండిగో విమానం ఉంది. దాదాపు మూడు గంటల కర్వాత అవి టేకాఫ్ అయినట్టు అధికారులు తెలిపారు. ఆ వస్తువు తెల్లగా ఉందని, అది కంటితో చూడగలిగేదని, సాయంత్రానికి అది కనిపించకుండా పోయిందని AAI అధికారి తెలిపారు.

ఆకాశంలో అప్పుడప్పుడు వింత వస్తువలు, ఆకారాలు కనిపించటం విదేశాల్లో తరచూ చూస్తుంటాం.. గ్రహాంతర వాసులు అని.. ఫ్లయింగ్ సాసర్స్ అని ప్రచారం జరుగుతుంది. మన దేశంలో ఎప్పుడూ ఇలాంటివి కనిపించలేదు.. ఫస్ట్ టైం గుర్తు తెలియని.. రాడార్ కూడా అందని ఓ వస్తువు గాల్లో ఎగురుతూ కనిపించటం చర్చనీయాంశం అయ్యింది. సాయంత్రానికి మాయం అయిన ఆ వస్తువులు గ్రహాంతర వాసుల ఫ్లయింగ్ సాసర్స్ అయితే కాదు కదా.. అనే ప్రచారం జోరుగా సాగుతుంది.