- ఐసీఎం ప్రోగాం డైరెక్టర్ శ్యామ్కుమార్
సదాశివనగర్, వెలుగు : మార్కెట్లో గిట్టు బాటు ధర లేకపోతే ప్రభుత్వ గోదాముల్లో పంటలు నిల్వ చేసుకోవాలని ఇన్స్టిట్యూట్ఆఫ్ కో ఆపరేటీవ్ మేనేజ్మెంట్(ఐసీఎం) ప్రోగ్రాం డైరెక్టర్ శ్యామ్కుమార్ రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గోదాముల్లో నిల్వ ఉంచిన పంటలకు 80 శాతం వరకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చన్నారు.
మల్లన్న గుట్ట వద్ద ప్రభుత్వ గోదాముల్లో పంటలు నిల్వ చేసుకోవాలన్నారు. ఉత్తమ రైతు మర్రి సంగారెడ్డిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి, వైస్ చైర్మన్ అమ్ముల పశుపతి, సీఈవో కడెం భైరయ్య, అసిస్టెంట్ రిజిస్ట్రార్ లక్ష్మాణ్, సొసైటీ డైరెక్టర్లు బక్కన్నగారి భాస్కర్, బత్తుల రాములు, ప్రవీణ్ రెడ్డి, ఉమామహేశ్వర్ రావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
