పిల్లలకు మహనీయుల గురించి చెప్పాలి

పిల్లలకు మహనీయుల గురించి చెప్పాలి

స్వాతంత్య్ర దినోత్సవం రోజున పిల్లలకు మహనీయుల గురించి చెప్పడమే కాకుండా ఇంటిదగ్గర వాళ్లతో ట్రై కలర్ క్రాఫ్ట్స్  చేయించాలి. చొక్కా లేదా డ్రెస్​కి పెట్టుకునే మూడు రంగుల బ్యాడ్జీని వాళ్లతోనే తయారు చేయించాలి. ఇలాచేస్తే పిల్లలకు జెండా పండుగ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.  

 కావాల్సినవి:  ఆరెంజ్​, వైట్​, గ్రీన్ కలర్ పేపర్స్​– ఎ4 సైజ్, పెన్సిల్​, స్టిక్కీ టేప్​, ఫెవికాల్, కత్తెర,  సేఫ్టీ పిన్​​. 

తయారీ:  ఒక్కో కలర్  పేపర్​ని  చతురస్రాకారంలో  నాలుగు ముక్కలుగా కత్తిరించాలి. ఆ పేపర్​ ముక్కల మీద పెన్సిల్​తో హార్ట్​ సింబల్​ గీసి, కత్తెరతో కత్తిరించాలి. వాటిని మధ్యకు మడిచి, గుండ్రని తెల్ల కాగితం మీద ముందుగా  ఆరెంజ్,​ ఆ తర్వాత తెలుపు, చివరగా ఆకుపచ్చపేపర్​ ముక్కల్ని అతికించాలి. 

అశోక చక్రం కోసం... చిన్నగా గుండ్రంగా కత్తిరించిన వైట్ పేపర్​ మీద నీలం రంగు స్కెచ్​తో 24 లైన్స్​ గీయాలి.  దాన్ని మధ్యలో అతికించాలి. తర్వాత వెనకాల సేఫ్టీ పిన్​ పెట్టి, ప్లాస్టర్ వేయాలి.  ఆరెంజ్​, గ్రీన్​ కలర్ పేపర్స్​ని 10 సెంటీమీటర్ల పొడవు ఉన్న రెండు సన్న ముక్కలుగా కత్తిరించాలి. వాటిని అంతే పొడవు ఉన్న వైట్ పేపర్​ మీద అతికించాలి. వీటిని సేఫ్టీ పిన్​ కింద రివర్స్​ ‘వి’ షేప్​లో అతికిస్తే  బ్యాడ్జి రెడీ.