ఇరాన్‌‌‌‌ - ఇజ్రాయిల్‌‌‌‌ యుద్ధం.. మార్కెట్‌‌‌‌లో పానిక్ సెల్లింగ్‌‌‌‌?

ఇరాన్‌‌‌‌ - ఇజ్రాయిల్‌‌‌‌ యుద్ధం.. మార్కెట్‌‌‌‌లో పానిక్ సెల్లింగ్‌‌‌‌?
  • పెరగనున్న వొలటాలిటీ
  • కంపెనీల రిజల్ట్స్‌‌‌‌, ఎకనామిక్‌‌‌‌ డేటాపై ఫోకస్ పెట్టాలన్న ఎనలిస్టులు

న్యూఢిల్లీ:  మిడిల్ ఈస్ట్‌‌‌‌లో నెలకొన్న ఘర్షణ వాతావరణం,  మాక్రో ఎకనామిక్ డేటా, కంపెనీల క్యూ4 రిజల్ట్‌‌‌‌ ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌‌‌‌ను నిర్ణయించనున్నాయి. శ్రీరామ నవమి  సందర్భంగా బుధవారం మార్కెట్‌‌కు  సెలవు. ‘ ఈ వారం స్టాక్ మార్కెట్‌‌‌‌కు చాలా కీలకం. ఇరాన్‌‌‌‌–ఇజ్రాయిల్‌‌‌‌ మధ్య నెలకొన్న గొడవ మరింత ముదిరితే మార్కెట్‌‌‌‌లో వొలటాలిటీ పెరగొచ్చు. పానిక్ సెల్లింగ్‌‌‌‌కు దారి తీయొచ్చు. జియో పొలిటిక్ అంశాల ప్రభావం క్రూడాయిల్స్‌‌‌‌పై ఎక్కువగా ఉంటుంది. వీటి ధరలను  మార్కెట్ జాగ్రత్తగా గమనిస్తుంది’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌‌‌‌మార్ట్‌‌‌‌ రీసెర్చ్ హెడ్‌‌‌‌ సంతోష్ మీనా అన్నారు. అలానే ఇన్ఫోసిస్‌‌‌‌, బజాజ్ ఆటో, విప్రో క్యూ4 రిజల్ట్స్ ఈ వారం వెలువడనున్నాయి.   

 యూఎస్ బాండ్‌‌‌‌ ఈల్డ్స్‌‌‌‌, డాలర్‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్ కదలికలను ట్రేడర్లు గమనించాలని ఎనలిస్టులు చెబుతున్నారు. ఐటీ మేజర్ టీసీఎస్‌‌‌‌ శుక్రవారం తన మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ( క్యూ4) రిజల్ట్స్‌‌‌‌ను ప్రకటించింది.  సోమవారం సెషన్‌‌‌‌లో ఈ రిజల్ట్స్ ప్రభావం కనిపించనుంది. ఇండియా హోల్‌‌‌‌సేల్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్లేషన్‌‌‌‌ డేటా,  మాన్యుఫాక్చరింగ్ డేటా, చైనా జీడీపీ గ్రోత్‌‌‌‌, యూఎస్ మాన్యుఫాక్చరింగ్ ప్రొడక్షన్‌‌‌‌, యూఎస్ ఇనీషియల్ జాబ్‌‌‌‌లెస్ క్లయిమ్స్ డేటా  ఈ వారం మార్కెట్‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌ను నిర్ణయించనున్నాయని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్‌‌‌‌ ఎనలిస్ట్ సింగ్‌‌‌‌ నందా అన్నారు.