
భారత అంతరిక్ష సంస్థ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ISRO SDSC ఎస్హెచ్ఏఆర్) టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిస్ట్స్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 14.
పోస్టుల సంఖ్య: 141.
పోస్టులు: సైంటిస్ట్స్/ ఇంజినీర్ ఎస్సీ 23, టెక్నికల్ అసిస్టెంట్ 28, సైంటిఫిక్ అసిస్టెంట్ 03, లైబ్రరీ అసిస్టెంట్ ఏ 01, రేడియోగ్రాఫర్ –ఏ 01, టెక్నీషియన్ బి 70, డ్రాఫ్ట్స్‌మెన్ బి 02, కుక్ 03, ఫైర్‌మెన్– ఏ 06, లైట్ వెహికల్ డ్రైవర్ ఏ 03, నర్స్–బి 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, బీఎస్సీ, డిప్లొమా, ఐటీఐ, పదో తరగతి, ఎంఎస్సీ, ఎం.టెక్/ ఎంఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 16.
లాస్ట్ డేట్: నవంబర్ 14.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ. 750.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు isro.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.