కాళేశ్వరం లింక్ 2 భూసేకరణకు తాత్కాలిక బ్రేక్

కాళేశ్వరం లింక్ 2 భూసేకరణకు తాత్కాలిక బ్రేక్

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ 2 భూసేకరణ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ ప్రక్రియలో తమకు అన్యాయం జరుగుతోందని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. భూసేకరణ ప్రక్రియ ఆపాలంటూ హైకోర్టు  చీఫ్ జస్టిస్ పి.వినోద్ కుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. నామాపూర్ గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్టు లింకు 2 కింద తాము విలువైన భూములు కోల్పోతున్నామని  బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు.

 

 

 

ఇవి కూడా చదవండి

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి చూస్తుంటే కంట్లో నీళ్లొస్తున్నాయి

ల్యాప్‌‌టాప్‌‌ వాడుతున్నారా? ఈ గాడ్జెట్స్ మీ కోసమే

ఆఫ్రికాలో పూసల్​ మీడియా