ఇంటర్ ఫస్టియర్​ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి : ప్రిన్సిపాల్‌‌ మోహన్

ఇంటర్ ఫస్టియర్​ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి : ప్రిన్సిపాల్‌‌ మోహన్

కోరుట్ల, వెలుగు:  కోరుట్ల మండలం కల్లూరులోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో 2025–-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్టియర్‌‌‌‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయిందని కాలేజీ ప్రిన్సిపాల్‌‌ మోహన్​ తెలిపారు. ఈనెల 5 నుంచి 20 వరకు అర్హులైన విద్యార్థులు ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

22 నుంచి కాలేజీల వారిగా దరఖాస్తుదారుల వివరాలను,26న సెలెక్షన్ లిస్ట్ ను ప్రకటిస్తారని, సెలెక్ట్ అయినవారికి 27 నుంచి 31 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారని తెలిపారు. ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఇసీ గ్రూపులలో ప్రతి గ్రూపుకు 40 మంది చొప్పున అడ్మిషన్స్ తీసుకోనున్నట్లు తెలిపారు.