ఐపీఎస్ అధికారి పురాన్ కుమార్ ఆత్మహత్యపై భార్య సంచలన ఆరోపణలు.. వారిపై చర్యలు కోరుతూ సీఎంకి లేఖ

ఐపీఎస్ అధికారి పురాన్ కుమార్ ఆత్మహత్యపై భార్య సంచలన ఆరోపణలు.. వారిపై చర్యలు కోరుతూ సీఎంకి లేఖ

హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పురాన్ కుమార్ అక్టోబర్ 7న చండీగఢ్‌లోని తన ఇంట్లో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవటం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో కూడా కలవరాన్ని కలిగించింది. సదరు సీనియర్ ఐపీఎస్ అధికారి బలవన్మరణానికి పాల్పడటానికి రాసిన 8 పేజీల సూసైడ్ నోట్ బయటపడింది. అందులో తనను మానసికంగా వేధింపులకు గురిచేసిన, తన పేరుపై జరిగిన లంచాల వ్యవహారం గురించి అందులో వివరించారు. తనకు సంబంధం లేకున్నా సన్నిుతుడైన వ్యక్తి చెప్పిన వివరాలతో పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చటంపై మనస్థాపానాకి గురైనట్లు వెల్లడైంది. 

తాజాగా ఆయన భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారి అమ్నీత్ పి. కుమార్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త విడిచి పెట్టిన ఎనిమిది పేజీల ఆత్మహత్యా నోట్‌లో ఉన్న కీలకమైన వివరాలు, ఆయనపై పైస్థాయి అధికారుల వేధింపులు, అవమానాలు, మానసిక ఒత్తిడి గురించి ఉన్న అంశాలు చండీగఢ్ పోలీస్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అమ్నీత్ కుమార్ సీఎంకి రాసిన తన లేఖలో పేర్కొన్నారు. అంత విస్తృతమైన ఆత్మహత్య నమోదు పత్రం ఉన్నప్పటికీ.. ఇప్పటికీ కారకులపై ఎటువంటి FIR నమోదు చేయలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 

సంఘటన జరిగిన రోజు ఆమె జపాన్‌లో అధికారిక పర్యటనలో ఉన్నట్లు చెప్పారు అమ్నీత్. భర్త నుంచి ఆత్మహత్యకు సంబంధించిన నోట్, విల్ అందుకున్న వెంటనే 15 సార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందన రాలేదని ఆమె చెప్పింది. చివరికి కుమార్తెను సంప్రదించి భర్తను చూసుకోమని చెప్పడంతో.. కూతురు ఇంటికి వెళ్లి చూసేసరికి భర్త బేస్‌మెంట్‌లోని రిక్లైనర్ చెయిర్‌పై మృతదేహంగా కనిపించారని వెల్లడించారు.

Also Read : ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం 

పురాన్ కుమార్ గత కొంతకాలంగా వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిడిలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన సహచరులు తెలిపిన వివరాల మేరకు, పనిలోని అంతర్గత ఉద్రిక్తతలు, ఉన్నతాధికారులతో సమస్యలు ఆయనను తీవ్రంగా కలతపెట్టినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. అయితే ఆత్మహత్యకు ముందు రాసిన నోట్‌లో ఉన్న అధికారులపై దర్యాప్తు జరపాలని అమ్నీత్ కుమార్ ప్రభుత్వం, అలాగే చండీగఢ్ పోలీస్ కమిషనర్‌ను కోరారు. తన భర్త మరణానికి కేవలం వ్యక్తిగత వేధింపులే కాక.. వ్యవస్థలోని మానసిక ఒత్తిడులు, నిర్లక్ష్య వైఖరి కూడా ప్రధాన పాత్ర పోషించాయని అభిప్రాయపడ్డారు.