
హైదరాబాద్, వెలుగు: మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్ ప్రొవైడర్ ఐస్ప్రౌట్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలోని ఆరో ఆర్బిట్‌లో ప్రీమియం సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించింది. దీనితో కలుపుకుంటే సంస్థకు 17 సెంటర్లు ఉన్నాయి. ఈ సంస్థ 2017 నుంచి హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కొత్తగా ప్రారంభమైన కేంద్రం 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఐదు అంతస్తుల్లో ఉంటుంది.
వివిధ రంగాల చెందిన నిపుణులకు వసతి కల్పించడానికి 4,000 సీట్లను అందిస్తుంది. సంస్థకు హైదరాబాద్‌లో 10 కేంద్రాలు, చెన్నైలో 2, బెంగళూరులో 2, పూణేలో 2 విజయవాడలో ఒక కేంద్రం ఉన్నాయి.