ఉగ్రవాదుల కాల్పుల్లో అప్నీ పార్టీ నేత గులాం హసన్ మృతి

ఉగ్రవాదుల కాల్పుల్లో అప్నీ పార్టీ నేత గులాం హసన్ మృతి

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. బధ్రతా దళాలపై కాల్పులకు తెగబడటంతో పాటు స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఇవాళ(గురువారం) ఓ రాజకీయ పార్టీ నాయకుడిని ప్రాణాలు తీశారు. అప్నీ పార్టీ నేత గులాం హసన్ లోన్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన చనిపోయారు. కుల్గాం జిల్లా దేవ్ సర్ లోని హసన్ లోన్ నివాసం దగ్గర ఈ ఘటన జరిగింది. గురువారం సాయంత్రం కొందరు టెర్రరిస్టులు ఆయన ఇంటి దగ్గర తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో లోన్ కుప్పకూలారు. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు డాక్టర్లు తెలిపారు.

హసన్ లోన్ 4 నెలల కిందటే అప్నీ పార్టీలో చేరారు. ఆయన గతంలో మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (PDP) లో కొనసాగారు. హసన్ లోన్ మృతిపై మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు.