
ఎండాకాలం వచ్చిందంటే.. కూల్ డ్రింక్ షాపులు, జ్యూస్ కేఫ్‌లు రద్దీగా ఉంటాయి. ప్రస్తుతం ఫ్రూట్ జ్యూస్ దుకాణాలు ప్రతి గల్లీలో వెలుస్తున్నాయి. కాని కొంతమంది జ్యూస్ కేఫ్‌లకు వెళ్లి మాట్లాడుకుంటూ జ్యూస్ తాగుతుంటారు. తాజాగా జపాన్‌లోని ఓ జ్యూస్ కేఫ్‌లో పనిచేసే వెయిటర్ ఓ దారుణానికి ఒడి గట్టింది. కష్టమర్లకు ఇచ్చే జ్యూస్‌లో తన రక్తాన్ని కలిపి ఇచ్చింది.
జపాన్ దేశంలోని సపోరోలో మొండాయిజీ అనే కేఫ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేఫ్‌లో పని చేస్తున్న వెయిటర్.. వెయిట్రెస్ ఇక్కడికి వచ్చి కస్టమర్లకు ఇచ్చే డ్రింక్‌లో తన రక్తాన్ని కలిపి ఇచ్చేది. ఈ విషయం బహిర్గతం కావడంతో ఈ డ్రింక్ తాగిన వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
రక్తాన్ని రహస్యంగా కలపేది..
వెయిట్రెస్‌ని అనే అమ్మాయి కేఫ్ కు వచ్చేవారికి ఇచ్చే పానీయాలలో తన రక్తాన్ని కలిపి ఇచ్చేది. ఆమె సాధారణంగా ఓరికారు అనే పానీయంలో తన రక్తాన్ని కలుపుతుంది. ఇందులో చాలా రకాల పండ్లు, కలర్ సిరప్ లను ఉపయోగిస్తారు. జపాన్ లో బ్లడీ మేరీ అనేది ఒక పానీయం. ఇది వివిధ రకాల పదార్థాలతో తయారు చేయబడింది. ఇందులో టమోటాలు, వోడ్కా , అనేక సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఇందులో టేస్ట్ కోసం కొన్ని మూలికలు కూడా కలుపుపతారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో కొద్దిరోజుల పాటు కేఫ్‌ను మూసి ఉంచారు.
ఉద్యోగం నుండి తొలగించారు
ఈ విషయం తెలిసిన వెంటనే కేఫ్ సిబ్బంది వెయిట్రెస్‌ను విధుల నుంచి తొలగించారు. వెయిట్రెస్ చేసిన దుశ్చర్యను పార్ట్‌టైమ్ టెర్రరిజంగా ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఒక ప్రకటన ద్వారా జారీ చేసిన కేఫ్ యాజమాన్యం తన వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది. ఈ కేఫ్ మామూలు కేఫ్ కాదని యాజమాన్యం పేర్కొంది. దీని పేరు మొండాయిజీ, దీని అర్థం ఇంగ్లీషులో నిస్సహాయ పిల్లలు నిర్వహించే కేఫ్ అని అర్థం. ఈ కేఫ్‌లో కష్టాల నుంచి బయటపడిన చిన్నారులు కస్టమర్లకు సేవలందిస్తున్నారు.