కాబుల్‌లో మరో దాడి జరగొచ్చు..అమెరికా హెచ్చరిక

కాబుల్‌లో మరో దాడి జరగొచ్చు..అమెరికా హెచ్చరిక

కాబూల్  ఎయిర్ పోర్ట్ లో  మరోసారి  దాడులు జరగొచ్చని  అమెరికా హెచ్చరించింది. 24 నుంచి 36 గంటల్లో  ఎయిర్ పోర్టు  దగ్గర  ఆత్మాహుతి  దాడి జరగొచ్చని  బలంగా నమ్ముతోంది అమెరికా. ఈ మేరకు  అమెరికా అధ్యక్షుడు  జో బైడెన్  ప్రకటన విడుదల  చేశారు. గ్రౌండ్  లెవెల్లో పరిస్థితులు చాలా ప్రమాదకరంగా  ఉన్నాయని చెప్పారు.  ఎయిర్ పోర్ట్ పై  ఉగ్రవాదులు దాడులు  చేసే అవకాశం  చాలా ఎక్కువగా  ఉందన్నారు.  వచ్చే 24 నుంచి 36గంటల్లో  దాడి జరగొచ్చని  తమ కమాండర్లు  తనకు  తెలిపారని  బైడెన్ చెప్పారు.  ఈ నెల 26న   ISIS-K జరిపిన  ఆత్మాహుతి దాడిలో  169 ఆఫ్గన్ పౌరులతో  పాటు... 13 మంది  అమెరికా సైనికులు  ప్రాణాలు కోల్పోయారు.