కొమురవెల్లి మల్లన్నకు బంగారు రాఖీ : జోగిని శ్యామల

కొమురవెల్లి మల్లన్నకు బంగారు రాఖీ : జోగిని శ్యామల
  • ఆలయానికి వెళ్లి కట్టిన జోగిని శ్యామల

కొమురవెల్లి, వెలుగు: రాఖీ పండుగ సందర్భంగా శనివారం కొమురవెల్లి మల్లికార్జునస్వామికి జోగిని శ్యామల బంగారు రాఖీ కట్టింది. శనివారం ఆమె స్వామిని దర్శించుకుంది. అనంతరం శ్యామల మాట్లాడుతూ.. 20 ఏండ్లుగా మల్లన్నస్వామికి రాఖీ కడుతున్నానని, గత పదేండ్ల నుంచి బంగారు రాఖీ కడుతున్నట్లు పేర్కొన్నారు.  అనంతరం ఆమెకు ఆలయ అర్చకులు స్వామివారి లడ్డూ ప్రసాదంతో  ఆశీర్వచనం అందజేశారు.