V6 News

పేదలకు అండగా కాంగ్రెస్ సర్కార్

పేదలకు అండగా కాంగ్రెస్ సర్కార్

మరికల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో పేదలకు గూడు కల్పిస్తున్నామని నారాయణపేట డీసీసీ మాజీ అధ్యక్షుడు కె.శివకుమార్​రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలో కాంగ్రెస్​ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యుల తరపున ప్రచారం చేశారు.

 రోడ్​ షోలో ఆయన మాట్లాడుతూ మరికల్​ మండలం ఏర్పాటుకు మొదటగా ఫైల్​  తయారు చేసింది తానేనని గుర్తు చేశారు. పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో ప్రజలకు ఏమి చేయలేదని విమర్శించారు. రెండేండ్ల పాలనలో కాంగ్రెస్​ సర్కార్​ ప్రజలకు ఇండ్లు, రేషన్​కార్డులు, రైతులకు రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్​  మద్దతుదారులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు.