లోక్ అదాలత్లో 191 కేసుల పరిష్కారం

లోక్ అదాలత్లో  191 కేసుల పరిష్కారం

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని 6 కోర్టుల్లో శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్​ అదాలత్​లో 191 కేసులను పరిష్కరించారు. ఇరు వర్గాలతో మాట్లాడి రాజీ కుదిర్చారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్​వీఆర్​ఆర్ వరప్రసాద్ మాట్లాడుతూ లోక్​ అదాలత్​ ద్వారా కేసులను వేగంగా పరిష్కరించుకోవచ్చన్నారు. మళ్లీ   అప్పీల్​కు వెళ్లే అవకాశం ఉండదన్నారు. న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి నాగరాణి, జడ్జీలు సుధాకర్​,   బి.దీక్ష,  అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, బార్​ అసోసియేషన్​ ప్రతినిధులు, అడ్వకేట్లు పాల్గొన్నారు. ​  

బోధన్​లో 708 కేసులు పరిష్కారం

బోధన్​ : బోధన్​లోని కోర్టులో నిర్వహించిన లోక్​ అదాలత్​లో 708 కేసులు పరిష్కారమైనట్లు ఐదో అదనపు జిల్లా న్యాయమూర్తి డి.వరూధిని తెలిపారు. జరిమానా రూపంలో రూ.13లక్షలకుపైగా  ప్రభుత్వ ఖజానాకు చెల్లించినట్లు తెలిపారు.