కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్, కొత్త బస్టాండుల్లో మంగళవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఢిల్లీలో బాంబు పేలుళ్ల దృష్ట్యా ఆయా ఏరియాల్లో ముందస్తుగా తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, బస్టాండుల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ప్రయాణికుల బ్యాగులు, ఆయా చోట్ల అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను చెక్‌చేశారు. టౌన్ సీఐ నరహరి తదితరులు ఉన్నారు.
