కామారెడ్డి, వెలుగు : కేసుల ఎంక్వైరీల్లో నాణ్యత ఉండాలని ఎస్పీ రాజేశ్చంద్ర సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్టేషన్, సర్కిల్, డీఎస్పీ కార్యాలయ రైటర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేసుల ఎంక్వైరీ, పరిశోధనల్లో నాణ్యత ప్రమాణాలు అత్యంత కీలకమన్నారు.
సీసీటీఎన్‌ఎస్ వ్యవస్థలో కేసులకు సంబంధించిన అన్ని వివరాలు సమయానుకూలంగా అప్‌డేట్ అవుతూ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సాక్షుల వాంగ్మూలాలు కేసుల పరిష్కారంలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఎఫ్‌ఐఆర్ నుంచి చార్జ్‌షీట్ వరకు అన్ని వివరాలను సమగ్రంగా నమోదు చేయడం ప్రతి రైటర్ బాధ్యత అని ఎస్పీ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
