సీఎం సమీక్షలో కునుకు తీసిన మంత్రి

సీఎం సమీక్షలో  కునుకు తీసిన మంత్రి

కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పై సీఎం బసవరాజ్‌  బొమ్మై అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా... సీఎం పక్కనే ఉన్న మంత్రి ఆర్ అశోక మాత్రం హాయిగా నిద్రపోయారు. ఆయన కునుకు తీస్తున్న ఫోటోలను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ  విమర్శలు గుప్పించింది. మునిగిపోవడంలో చాలా రకాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు వర్షంలో మునిగిపోయారు. మంత్రి నిద్రలో మునిగిపోతున్నారు అంటూ విమర్శంచింది.

బెంగళూరులో వరదల నివారణకు ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేయాలని సమీక్షలో నిర్ణయించినట్లు సీఎం బొమ్మై తెలిపారు. గ‌త 90 ఏళ్లలో ఇలాంటి వ‌ర్షం ప‌డ‌లేద‌ని అన్నారు.  కర్ణాటకలో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బెంగళూరు నగరంలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.