
బెంగళూరు: కర్నాటకలో భారీ చోరీ కేసును చేధించారు పోలీసులు. కోటి 20 లక్షల రూపాయల విలువైన నగలు ఎత్తుకెళ్లిన దొంగలముఠాను బెంగళూరు సౌత్ పోలీసులు పట్టుకున్నారు. తాలహట్టపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ జంట నుంచి కోటి రూపాయల విలువైన నగలు ఎత్తుకెళ్లారు దొంగలు. బ్యాంకు లాకర్ లో ఉన్న నగలు తీసుకెళ్తున్న జంటను వెంబడించిన దొంగలు.. పది నిమిషాల్లో వాటిని తీసుకుని పరారయ్యారు.
బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా విచారణ మొదలుపెట్టిన పోలీసులు నిందితుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారున్నట్టు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నిందితులంతా చాలాకాలంగా చోరీలు చేస్తున్నారని 20 కీలక కేసుల్లో నిందితులని చెప్పారు. నిందితుల దగ్గర నుంచి చోరీ చేసిన నగలన్నీ రికవరీ చేశామని తెలిపారు.
ఇవి కూడా చదవండి
డబ్బులు దాచుకునేందుకే పార్థసారథికి టికెట్
హైదరాబాద్ లో ఆకట్టుకుంటున్న శిల్పాలు