మంత్రి మల్లారెడ్డి ఇలాకాలో రోడ్డెక్కిన సర్పంచ్.. బిల్లులు చెల్లించాలంటూ ధర్నా

మంత్రి మల్లారెడ్డి ఇలాకాలో రోడ్డెక్కిన సర్పంచ్.. బిల్లులు చెల్లించాలంటూ ధర్నా

మంత్రి మల్లారెడ్డి ఇలాకాలో సర్పంచ్ రోడ్డెక్కింది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు చెల్లించాలంటూ ఆందోళనకు దిగింది. అధికార పార్టీ సర్పంచే గ్రామ పంచాయితీ కార్యాలయం ముందు బైఠాయించింది. సొంత నిధులతో అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు మంజూరు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర గ్రామపంచాయితీలో చోటు చేసుకుంది. 

మేడ్చల్ జిల్లా  కీసర గ్రామ పంచాయతీ కార్యాలయం  ముందు సర్పంచ్ మాధురి, ఉప సర్పంచ్ , వార్డు సభ్యులు ఆందోళనకు దిగారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ , ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి జేసీబీల యజమానులు నిరసన చేపట్టారు. 2021 పల్లె ప్రగతి,  2022 పల్లె ప్రగతి కార్యక్రమాల్లో తమ జేసీబీ వాహనాలతో గ్రామ పంచాయతీలో పాత ఇండ్లను కూల్చివేశామని..అయితే పనిచేయించుకుని ఇప్పటి వరకు ఎలాంటి డబ్బులు ప్రభుత్వం చెల్లించలేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల కోసం  గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని ఎన్ని సార్లు అడిగిన ఫలితం లేదన్నారు. అందుకే తమ జేసీబీలతో పంచాయితీ కార్యాలయం ముందు నిరసన చేపట్టామని తెలిపారు.