ముస్లింలు ఇచ్చిన భారత్ మాతాకి జై నినాదాన్ని వదిలేస్తారా.? : కేరళ సీఎం పినరయ్ విజయన్

 ముస్లింలు ఇచ్చిన భారత్ మాతాకి జై నినాదాన్ని వదిలేస్తారా.? : కేరళ సీఎం పినరయ్ విజయన్

కేరళ సీఎం పినరయ్ విజయన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. భారత్ మాతాకీ జై, జై హింద్ నినాదాలను ఇద్దరు ముస్లింలే మొదట ఇచ్చారని..అలాంటప్పుడు ఆ నినాదాలను సంఘ్ పరివార్ వదిలేస్తుందా అని ప్రశ్నించారు. అజీముల్లా ఖాన్‌ భారత్‌ మాతాకీ జై అంటే.. ఆబిద్‌ హసన్‌ అనే భారత దూత జై హింద్‌ అని నినదించారని  వెల్లడించారు.

 
సీఏఏకు వ్యతిరేకంగా కేరళలోని మలప్పురంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో, స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా మంది ముస్లింలు కీలక పాత్ర పోషించారని చెప్పారు.  ముస్లిం పాలకులు సాంస్కృతిక సారథులన్నారు.ముస్లింలను దేశం నుంచి వెళ్లాగొట్టాలని వాదిస్తున్న సంఘ్ పరివార్ నేతలు, కార్యకర్తలు చారిత్రక వాస్తవాలను తెలుసుకోవాలని కౌంటర్ ఇచ్చారు పినరయ్. అవగాహన లేని సంఘ్ పరివార్ నేతలు ఇక్కడికొచ్చి  భారత్‌ మాతాకీ జై అని నినదించాలని డిమాండ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఏఏ అనేది బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండా అని విజయన్ అన్నారు. 2019 నాటి CAA వ్యతిరేకంగా తాము నిరసనలు తెలుపుతుంటే, కాంగ్రెస్ మాత్రం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. నిరసనల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎవరూ లేరని రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నారని చెప్పారు. వామపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని గుర్తు చేశారు. 

 

 

.